సీఎం బాధ్యత వహించాలి: బీఎస్పీ
NEWS Aug 07,2026 08:00 pm
నారాయణపేట జిల్లా ఎక్లాస్‌పూర్ ప్రభుత్వ పాఠశాలలో 3వ తరగతి విద్యార్థి రంజిత్ పాము కాటుతో మృతి చెందడం బాధాకరమని, దీనికి సీఎం రేవంత్ రెడ్డి నైతిక బాధ్యత వహించాలని బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బొదిగెలి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి రూ.1 కోటి ఎక్స్‌గ్రేషియా, కుటుంబంలోని అర్హుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని జిల్లా విద్యాశాఖ అధికారికి వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వానికి ప్రైవేట్ పాఠశాలలపై ఉన్న శ్రద్ధ, ప్రభుత్వ పాఠశాలలపై లేదని విమర్శించారు.