షాద్‌నగర్‌లో ఘనంగా మైసమ్మ బోనాలు
NEWS Aug 07,2026 07:51 pm
ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ మున్సిపాలిటీ 18వ వార్డులో వార్డు కౌన్సిలర్ జమాల్పూర్ సంతోషి చందూలాల్ ఆధ్వర్యంలో మైసమ్మ బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి, అందంగా అలంకరించిన బోనాలను తలపై ఎత్తుకుని డప్పుల చప్పుళ్లు, నృత్యాల మధ్య ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.