సైబర్ మోసాలపై అవగాహన కల్పించాలి
NEWS Aug 07,2026 07:20 pm
పెండింగ్ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నాగర్‌కర్నూల్ జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో జరిగిన నెలవారీ నేర సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసుల దర్యాప్తును వేగవంతం చేసి, బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. డయల్-112 కాల్స్ పట్ల నిర్లక్ష్యం వహించవద్దని సూచించారు. సైబర్ మోసాలపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులకు ఆదేశించారు.