మెట్‌పల్లిలో 15 వాహనాలపై కేసులు
NEWS Aug 06,2026 11:13 pm
మెట్‌పల్లి పట్టణంలోని డిపో సమీప జాతీయ రహదారిపై రవాణా శాఖ అధికారులు వాహన తనిఖీలు నిర్వహించారు. జిల్లా స్పెషల్ స్క్వాడ్ అధికారి వంశీధర్ ఆధ్వర్యంలో చేపట్టిన తనిఖీల్లో ధ్రువపత్రాలు లేని 15 వాహనాలను గుర్తించి కేసులు నమోదు చేశారు. వాహనదారులు డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్, బీమా, ఇతర అవసరమైన పత్రాలను వెంట ఉంచుకుని ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని అధికారులు సూచించారు.