బీజేపీ ధార్మిక సెల్ ఆధ్వర్యంలో బోనాలు
NEWS Aug 06,2026 11:12 pm
కోరుట్ల పట్టణంలోని గడిబురుజుల వద్ద వెలసిన గడి మైసమ్మ తల్లికి బీజేపీ ఎండోమెంట్ ధార్మిక సెల్ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు సమర్పించారు. మహిళలు డప్పు చప్పుళ్ల మధ్య బోనాలు తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. త్వరలో గడిబురుజు వద్ద మైసమ్మ ఆలయం నిర్మించి, కోరుట్ల పురావస్తు సంపదను పరిరక్షిస్తామని నాయకులు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ మాధవేని నరేష్, పట్టణ అధ్యక్షుడు కస్తూరి లక్ష్మీనారాయణతో పాటు బీజేపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.