వెల్ఫేర్ గ్రూప్ అక్రమాలు .. ED సోదాలు
NEWS Aug 05,2026 11:47 am
తెలుగు రాష్ట్రాల్లో వెల్ఫేర్ గ్రూప్ పేరుతో పలు అక్రమాలకు పాల్పడ్డారు వైసీపీ నేత విజయ్ ప్రసాద్. దీంతో హైదరాబాద్, విశాఖలోని ఐదుచోట్ల సోదాలు జరుపుతున్నారు ఈడీ అధికారులు. విజయప్రసాద్ ఇంట్లో సోదాలు జరుపుతున్నారు బిహార్ కు చెందిన ఈడీ అధికారుల బృందం. విశాఖ వైసీపీ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు విజయప్రసాద్. వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ కంపెనీల ఛైర్మన్‍గా అవకతవకలకు పాల్పడిన కేసులో సోదాలు సాగుతున్నాయి.