నేరాలపై కఠిన చర్యలు: ఎస్పీ
NEWS Aug 04,2026 11:47 am
కామారెడ్డి జిల్లా బాధితులకు సత్వర న్యాయం అందించడమే లక్ష్యంగా కేసుల్లో నాణ్యమైన, వేగవంతమైన దర్యాప్తు జరపాలని కామారెడ్డి ఎస్పీ రాజేశ్ చంద్ర అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన నెలవారీ సమీక్షలో ఆయన మాట్లాడారు. పెండింగ్ కేసుల వేగవంతం, సీసీటీఎన్ఎస్ అప్లోడ్, గంజాయి, సైబర్ నేరాల అదుపు, మహిళల భద్రతకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు.