వైసీపీ మాజీ ఎమ్మెల్యే ముస్తఫా గుజరాత్ లో అరెస్ట్
NEWS Aug 04,2026 12:42 pm
వైసీపీ మాజీ ఎమ్మెల్యే ముస్తఫా గుజరాత్ లో అరెస్టయ్యారు. పొగాకు వ్యాపారి అభి కిడ్నాప్ కేసులో ముస్తఫాని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. గుజరాత్ లో అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో నూజివీడు పోలీసులు ముస్తఫాను అరెస్టు చేశారు. వ్యాపార వివాదాల నేపథ్యంలో పొగాకు వ్యాపారి కుమారుడితో పాటు మరో ముగ్గురిని కిడ్నాప్ చేసి బెదిరింపులకు పాల్పడిన ఘటనలో మాజీ ఎమ్మెల్యే షేక్ మహమ్మద్ ముస్తఫా, ఆయన కుమారుడు బషీర్‌లపై నూజివీడు పోలీసులు కిడ్నాప్, ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేశారు.