టీటీడీ బ్రేక్ దర్శన టికెట్లు ఇప్పిస్తామని వైసీపీ నేత మోసం బయటపడింది. టీటీడీ దర్శనం టిక్కెట్ల పేరుతో దళారుల మాటలు నమ్మవద్దని టీటీడీ అధికారులు ఎంతగా చెబుతున్నా..భక్తులు మళ్లీ మళ్ళీ మోసపోతూనే ఉన్నారు. తిరుమలలో స్వామివారి బ్రేక్ దర్శన టికెట్లు ఇప్పిస్తామని పలువురి నుంచి రూ.లక్షలు వసూలు చేశాడు వైసీపీ నేత కాసు మహేష్ రెడ్డి అనుచరుడు. దీంతో గురజాలకి చెందిన వైసీపీ నేత వంకాయల అక్షయ్ పై కేసు నమోదు చేశారు పోలీసులు.