దేశాభివృద్ధి కోసం అహర్నిశలు పాటుపడుతున్న ప్రధాని మోడీని అనకూడని మాటలు అంటున్నారని, ఆ మాటలు వింటుంటే నాకు దుఃఖం వేస్తోందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. దేశం కోసం కష్టపడేవారికి ఇదేనా మనం ఇచ్చే గౌరవం అని ప్రశ్నించారు. తిట్టిన వారిని పెద్ద మనసుతో క్షమించిన వ్యక్తి మోడీ అని.. ఇది చూశాక మోడీ పాదాలకు నమస్కారం చేస్తున్నానన్నారు. నేటి యువతకు తల్లిదండ్రులు సరైన సంస్కారం నేర్పించాలన్నారు.