ప్రపంచం మొత్తం ఉత్తరాంధ్ర వైపు చూస్తోందని కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు అన్నారు. ఎర్రబస్సులు కాదు.. ఎయిర్ బస్‌లు తిరిగే ప్రాంతమని నిరూపించామన్నారు. భోగాపురం విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా జాతికి అంకితం చేసిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో కేంద్రమంత్రి మాట్లాడారు.