RTC ఎలక్ట్రిక్ ఆటోలు రాబోతున్నాయ్
NEWS Jul 30,2026 10:06 pm
ప్రయాణికులకు మెరుగైన రవాణా అనుభూతిని అందించేందుకు తెలంగాణ RTC 'ఫస్ట్ మైల్ టు లాస్ట్ మైల్ కనెక్టివిటీ' పేరుతో ఎలక్ట్రిక్ ఆటోలను ప్రవేశపెడుతోంది. ప్రయాణికులు బస్ టికెట్‌తో పాటే ఆటో టికెట్‌ను ఒకేసారి బుక్ చేసుకోవచ్చు. తొలి దశలో హైదరాబాద్ గ్రేటర్ పరిధిలో, ఆ తర్వాత వరంగల్, కరీంనగర్ వంటి నగరాల్లో ఇవి ప్రారంభం కానున్నాయి. ప్రైవేట్ యాప్‌ల కంటే తక్కువ ఛార్జీలతో ఈ-ఆటోలు ప్రయాణికులకు సేవలు అందిస్తాయి.