మెట్‌పల్లి బస్ డిపో చౌరస్తా వద్ద అర్ధరాత్రి కూరగాయల వ్యాన్ అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న పాన్ షాపును ఢీకొట్టింది. ప్రమాదంలో పాన్ షాప్ నిర్మాణం అక్కడే నిద్రిస్తున్న ఓ మహిళపై కూలిపోవడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితురాలు మతిస్థిమితం కోల్పోయి రోడ్డుపై తిరుగుతూ జీవనం సాగిస్తున్న మహిళగా స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని 108 అంబులెన్స్‌లో ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై విచారణ కొనసాగుతోంది.