తమ్మినేని కుమారుడికి బిగ్ షాక్
NEWS Jul 27,2026 04:21 pm
వైసీపీ నేత, మాజీ స్పీకర్ తమ్మినేని కుమారుడికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ల్యాండ్ ఫోర్జరీ కేసులో తమ్మినేని కుమారుడు నాగ్‌కు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది హైకోర్ట్. తమ్మినేని కుమారుడు నాగ్ అనుబంధ పిటిషన్‌ను కొట్టివేసింది హైకోర్టు. ఫోర్జరీ దస్త్రాలతో అక్రమ రిజిస్ట్రేషన్‌కు పాల్పడిన కేసులో నాగ్ పిటిషన్ కొట్టివేసింది. ఇదే కేసులో తమ్మినేని సీతారామ్ సతీమణి వాణికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.