పోలవరం జిల్లా రంపచోడవరం మండలం ఇర్లపల్లిలో విషాదం చోటుచేసుకుంది. టెన్త్ విద్యార్థిని శివానీ సూసైడ్ నోట్ రాసి ఉరివేసుకుంది. - మూడు రోజుల క్రితం తల్లికి వందనం కార్యక్రమంలో శివానీ పాల్గొంది. సీఎం చంద్రబాబుతో కలిసి భోజనం చేసిన విద్యార్థిని శివానీ. ముర్రం శివాని తనువు చాలించడం నన్ను తీవ్ర విషాదంలోకి నెట్టేసిందన్నారు సీఎం చంద్రబాబు. రంపచోడవరంలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో వేదికపై ఎంతో ఉత్సాహంగా మాట్లాడిన శివాని బలవన్మరణం తనకు ఆవేదన కలిగించిందన్నారు.