జగిత్యాల జిల్లా ప్రైవేట్ బస్ ట్రావెల్స్ యాజమానులు జిల్లా రవాణా కార్యాలయంలో డీటీవో సందానికి వినతిపత్రం అందజేశారు. వాహనాలపై విధిస్తున్న క్వార్టర్ ట్యాక్స్‌ను తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం అమలులో ఉన్న పన్ను భారం వల్ల ట్రావెల్స్ నిర్వహణ కష్టంగా మారిందని తెలిపారు. ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిశీలించేలా చర్యలు తీసుకుంటామని డీటీవో హామీ ఇచ్చారు.