వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న జువ్వాడి
NEWS Jul 25,2026 11:58 am
ఆషాఢ మాస తొలి ఏకాదశి సందర్భంగా వెల్మ కార్పొరేషన్ చైర్మన్, కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ జువ్వాడి నర్సింగరావు మెట్‌పల్లి శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలి ఏకాదశి సందర్భంగా ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. తెల్లవారుజాము నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు క్యూలైన్లు ఏర్పాటు చేసి, ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన ఏర్పాట్లు చేశారు.