వెట్టి చాకిరీ ద్వారా తయారుచేసిన వస్తువుల దిగుమతులపై సరైన నిషేధం అమలు చేయడం లేదనే ఆరోపణలతో అమెరికా.. భారత్ సహా దాదాపు 60 భాగస్వామ్య దేశాల నుంచి వచ్చే దిగుమతులపై 10% నుంచి 12.5% వరకు కొత్త సుంకాలను విధిస్తున్నట్లు అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ప్రారంభంలో భారత్‌పై 12.5 శాతం టారిఫ్ విధించాలని ప్రతిపాదించినప్పటికీ.. వెట్టి చాకిరీ నిరోధక చట్టాల అమలును భారత్ వేగవంతం చేయడంతో ఈ పన్నును 10 శాతానికి తగ్గించారు.