ములుగు: వాజేడు (M) చీకుపల్లివాగు ఎగువ ప్రాంతంలోని బొగత జలపాతం టూరిస్టులకు కనువిందు చేస్తోంది. ఎత్తైన అటవీ ప్రాంతం నుంచి పారుతున్న వరద గుట్టల నుంచి జాలు వారుతోంది. అటవీ శాఖ అనుమతి ఉండడంతో వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు తరలివస్తున్నారు. పాలనురగలా జాలువారుతున్న జల ధారలను తిలకిస్తున్నారు. వరద ఉద్ధృతి తగ్గడంతో జలపాతం దిగువన నీటి కొలనులో ఈత కొడుతూ ఉత్సాహంగా గడుపుతున్నారు.