ఓపెన్ స్కూల్‌లో ప్రవేశాలకు అవకాశం
NEWS Jul 23,2026 10:25 pm
చదువు మధ్యలో మానేసిన వారు, ఉద్యోగులు, గృహిణులు, పదో లేదా ఇంటర్‌లో ఫెయిల్ అయిన వారికి తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ శుభవార్త తెలిపింది. 2026–27 విద్యా సంవత్సరానికి పదో తరగతి, ఇంటర్మీడియట్ ప్రవేశాలకు ఈ నెల 28 వరకు దరఖాస్తులు స్వీకరిస్తోంది. 14 ఏళ్లు పూర్తైన వారు పదో తరగతికి, 15 ఏళ్లు నిండి పదో తరగతి ఉత్తీర్ణులైన వారు ఇంటర్‌లో చేరవచ్చు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత మార్గదర్శకత్వం, పుస్తకాలు, సెలవు రోజుల్లో తరగతులు, వాట్సాప్ ద్వారా పాఠాలు అందుబాటులో ఉంటాయి. పూర్తి వివరాలు తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.