'యువత భవిష్యత్తును నాశనం చేసిందే మీరు’
NEWS Jul 23,2026 12:28 pm
'యువత భవిష్యత్తును నాశనం చేసిందే మీరంటూ ప్రధాని మోడీపై విరుచుకుపడ్డారు రాహుల్ గాంధీ. 'నీట్' ఆందోళనల నేపథ్యంలో ప్రధాని మోదీ చేసిన 'ఫాస్ట్ ట్రాక్ కోర్టుల' ప్రకటనపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ప్రభుత్వం విద్యార్థుల ప్రయోజనాలను కాపాడుతోందన్న ప్రధాని మాటలను ఆయన పూర్తిగా తిరస్కరించారు. 'మన దేశ యువత భవిష్యత్తుకు అతిపెద్ద ద్రోహం చేసి, దానిని నాశనం చేసింది మీరే' అంటూ రాహుల్ గాంధీ ఆరోపించారు.