కసిరే పురుషోత్తంకు ఘనంగా సన్మానం
NEWS Jul 23,2026 10:32 am
నేషనల్ హ్యూమన్ రైట్స్ జస్టిస్ మూవ్‌మెంట్ నిర్మల్ జిల్లా అధ్యక్షుడిగా కసిరే పురుషోత్తం ఇటీవల బాధ్యతలు స్వీకరించారు. నిర్మల్ పట్టణంలోని సిరి బకెట్ హాల్‌లో ఆయనకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. శాలువా కప్పి, పూల బొకే అందజేసి పలువురు నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మానవ హక్కుల పరిరక్షణకు, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. గాంధారి సూర్యకుమార్, వెన్నెల భూమన్న, బొద్దుల భానుచందర్ తదితరులు పాల్గొని నూతన జిల్లా అధ్యక్షుడికి అభినందనలు తెలిపారు.