తెలంగాణలో 2 రోజులు విస్తారంగా వర్షాలు
NEWS Jul 22,2026 09:36 pm
నైరుతి రుతుపవన ద్రోణి ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బుధ, గురువారాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తర తెలంగాణలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, గురువారం కూడా వాతావరణం మేఘావృతమై ఉంటుందని చెప్పారు. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో బుధవారం రాత్రి వర్షం కురిసింది.