కిషన్ నాయక్ కుటుంబాన్ని పరామర్శించిన సంపత్ గౌడ్
NEWS Jul 23,2026 11:17 am
ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇంచార్జ్ ఎదురుగట్ల సంపత్ గౌడ్ లింగంపేట్ మండలంలోని అయ్యపల్లి తండా గ్రామ మాజీ సర్పంచ్ కిషన్ నాయక్ తల్లి ఇటీవల మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబ సభ్యులను ఓదార్చి, ధైర్యంగా ఉండాలని సూచించారు. ఆయన వెంట మండల అధ్యక్షుడు పోకల సాయిరాం, జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రతాప్ రెడ్డి, జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షుడు జైల్ సింగ్, శెట్‌పల్లి గ్రామ అధ్యక్షులు సిద్ధయ్య, కృష్ణ గౌడ్, మండల కార్యదర్శి మహేందర్ తదితరులు పాల్గొని కిషన్ నాయక్ కుటుంబానికి తమ సానుభూతిని తెలియజేశారు.