దుబాయిలో ఘనంగా బతుకమ్మ-బోనాల వేడుకలు
NEWS Jul 22,2026 01:22 pm
దుబాయిలో గల్ఫ్ తెలంగాణ ఫోరమ్ ఆధ్వర్యంలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలైన బతుకమ్మ, బోనాల పండుగలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో జీటీఎఫ్ అధ్యక్షుడు ఆకుల సురేందర్ పటేల్, తెలంగాణ ఎన్ఆర్ఐ బోర్డు అడ్వైజరీ కమిటీ సభ్యుడు పెద్ద సత్యం గౌడ్, జనరల్ సెక్రటరీ, అల్రిష్ గ్రూప్ చైర్మన్ బాలరాజ్ గౌడ్‌తో పాటు యుజ్వేందర్, శ్రీకాంత్, రాజేష్, వినోద్, సతీష్ రెడ్డి, సునీత, అభినవ్, రాజేశ్వర్ పాల్గొన్నారు. కళ్యాణి, ఉష, కల్పన, లక్ష్మితో పాటు మహిళలు సంప్రదాయ దుస్తుల్లో బతుకమ్మ ఆడి, బోనాల ఉత్సవాల్లో పాల్గొని తెలంగాణ సంస్కృతి వైభవాన్ని ప్రవాస భారతీయులకు, భావితరాలకు చాటిచెప్పారు.