విద్యార్థులకు ఆటవస్తువులు పంపిణీ
NEWS Jul 20,2026 09:42 pm
కోరుట్ల: SRSP క్యాంప్ గడి కల్లూరు రోడ్డులోని ప్రాథమిక పాఠశాలలో సోమవారం లయన్స్ క్లబ్ కోరుట్ల ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆటవస్తువులు, స్వీట్లు పంపిణీ చేశారు. మాజీ జిల్లా వ్యవసాయ అధికారి జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థుల శారీరక దృఢత్వం, మానసిక వికాసానికి ఆటలు దోహదపడతాయని నిర్వాహకులు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలకు లయన్స్ క్లబ్ అందిస్తున్న సేవలను ప్రధానోపాధ్యాయులు నునావత్ రాజు కొనియాడారు. లయన్స్ క్లబ్ ప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.