దుబాయిలో ఘనంగా బోనాల వేడుకలు
NEWS Jul 20,2026 09:44 pm
దుబాయిలో గల్ఫ్ తెలంగాణ ఫోరమ్ (జీటీఎఫ్) ఆధ్వర్యంలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలైన బతుకమ్మ, బోనాల పండుగలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. జీటీఎఫ్ అధ్యక్షుడు ఆకుల సురేందర్ పటేల్, తెలంగాణ ఎన్ఆర్ఐ బోర్డు అడ్వైజరీ కమిటీ సభ్యుడు పెద్ద సత్యం గౌడ్, జనరల్ సెక్రటరీ బాలరాజ్ గౌడ్, అల్రిష్ గ్రూప్ చైర్మన్ బాలరాజ్ గౌడ్, జీటీఎఫ్ నాయకులు యుజ్వేందర్, శ్రీకాంత్, రాజేష్, వినోద్, అభినవ్ పాల్గొన్నారు. కళ్యాణి, ఉష, కల్పన, శ్వేతతో పాటు జీటీఎఫ్ మహిళా సభ్యులు, అక్కాచెల్లెళ్లు పెద్ద సంఖ్యలో హాజరై బతుకమ్మ ఆడుతూ, బోనాల ఉత్సవాల్లో పాల్గొని తెలంగాణ సంస్కృతి వైభవాన్ని చాటిచెప్పారు.