భోగాపురంలో నిర్మాణం అయిన అల్లూరి సీతారామ రాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి అంతా సిద్ధం అయింది. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మితమైన గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాన్ని ఆగస్టు 1వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఇది ప్రధాన రవాణా కేంద్రంగా మారనుండగా, విశాఖపట్నం నుంచి ప్రత్యేక ఎలక్ట్రిక్ బస్సు సర్వీసులు కూడా అందుబాటులోకి రానున్నాయి.