పీవీ సింధు సరికొత్త చరిత్ర
NEWS Jul 20,2026 06:22 pm
తెలుగు తేజం, భారత స్టార్ షట్లర్ పీవీ సింధు మరోసారి కొత్త చరిత్రకి శ్రీకారం చుట్టింది. ప్రతిష్ఠాత్మక జపాన్ ఓపెన్ సూపర్-750 టోర్నమెంట్‌లో మహిళల సింగిల్స్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఫైనల్లో ఆతిథ్య జపాన్‌కు చెందిన ప్రపంచ ఛాంపియన్ అకానే యమగుచిపై సింధు విజయం సాధించింది. జపాన్ ఓపెన్ టైటిల్ గెలిచిన తొలి భారత మహిళా షట్లర్‌గా పీవీ సింధు రికార్డ్ సృష్టించింది. ఆదివారం జరిగిన ఫైనల్‌లో పీవీ సింధు అద్భుత ఆటతీరుతో ఆకట్టుకుంది.