కేబీ హోమియో కేర్ క్లినిక్‌ను సందర్శించిన శ్రీహరిరావు
NEWS Jul 20,2026 02:08 pm
నిర్మల్ పట్టణంలోని నూతనంగా ప్రారంభమైన కేబీ హోమియో కేర్ క్లినిక్‌ను నియోజకవర్గ ఇన్‌చార్జి కూచాడి శ్రీహరి రావు సందర్శించారు. ఆస్పత్రి యాజమాన్యం మాజీ జెడ్పీటీసీ బుచ్చన్న, డాక్టర్ సుజ్ఞాన్‌ను అభినందించారు. జిల్లావాసులు ఆధునిక హోమియో వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం ఆస్పత్రి యాజమాన్యం శ్రీహరి రావును శాలువాతో సన్మానించింది. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.