డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపక పోస్టులు
NEWS Jul 20,2026 08:10 am
భైంసాలోని గోపాల్‌రావు పాటిల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి అతిథి అధ్యాపక పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ కర్రోళ్ల బుచ్చయ్య తెలిపారు. తెలుగు, ఆంగ్ల, ఉర్దూ మాధ్యమాల్లో పలు సబ్జెక్టులకు ఖాళీలు ఉన్నాయి. సంబంధిత సబ్జెక్టులో పీజీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు జూలై 22 సాయంత్రం 4.30 గంటల్లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఇంటర్వ్యూలు జూలై 23 ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నట్లు తెలిపారు.