ఏపీలో ఆగస్ట్ 15 వేడుకలకు భారీ ఏర్పాట్లు
NEWS Jul 18,2026 12:07 pm
ఆంధ్రప్రదేశ్‌లో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను గతంలో ఎన్నడూ లేని రీతిలో అత్యంత ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత సన్నాహాలు చేస్తోంది. 'స్వర్ణాంధ్ర 2047' ఇతివృత్తంతో రాజధాని అమరావతి వేదికగా ఈ వేడుకలను నిర్వహించనున్నారు. కార్యక్రమ ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జె. సాయి ప్రసాద్ శుక్రవారం సచివాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.