విజయ్ సర్కార్ ని కూల్చేందుకు ప్రాజెక్ట్ మేఘాలయ
NEWS Jul 18,2026 12:02 pm
తమిళనాడు ముఖ్యమంత్రి గా ఇటీవలే అధికారం చేపట్టిన జోసెఫ్ విజయ్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు పన్నిన కుట్రకు ‘ప్రాజెక్ట్ మేఘాలయ’గా పేరు పెట్టినట్లు ఆ రాష్ట్ర పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. అయితే, ఈ పేరు ఎందుకు పెట్టారన్నది పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రవేశపెట్టబోయే అవిశ్వాస తీర్మానానికి మద్దతు కూడగట్టేందుకు సుమారు 15 మంది టీవీకే ఎమ్మెల్యేలకు భారీమొత్తంలో డబ్బులు ఆశ చూపినట్లు వార్తలొచ్చాయి.