అనపర్తి నియోజకవర్గంపై తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. ఇక్కడ పార్టీని మరింత బలోపేతం చేయడానికి పార్టీ అధిష్టానం కొత్త ఇన్ ఛార్జిని నియమించింది. అనపర్తి నియోజకవర్గంలో పార్టీని, క్యాడర్‌ను సమన్వయం చేసే బాధ్యతల్ని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కుమారుడు మనోజ్‌కుమార్ రెడ్డికి అప్పగించింది. 2024 ఎన్నికలలోఅనపర్తి రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. అనపర్తి స్థానాన్ని పొత్తు ధర్మంలో భాగంగా బీజేపీకి కేటాయించారు.