దాల్మియా సిమెంట్ విస్తరణకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
NEWS Jul 15,2026 01:03 pm
రాయలసీమ ప్రగతిలో మరో మైలురాయి చేరింది. కడప జిల్లా మైలవరం మండలం చిన్నకొమెర్ల సమీపంలో దాల్మియా సిమెంట్ రెండో ప్లాంట్ విస్తరణ పనులకు మంత్రి నారా లోకేశ్ శంకుస్థాపన చేశారు.రూ.3,100 కోట్లతో చేపట్టనున్న ఈ విస్తరణ ప్రాజెక్టు ద్వారా మరో వేలాదిమందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. పరిశ్రమల విస్తరణతో కడప జిల్లాలో పారిశ్రామికాభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని అధికారులు తెలిపారు.