రైల్వే వెబ్‌సైట్.. టికెట్ బుకింగ్ స్పీడ్!
NEWS Jul 15,2026 10:57 am
జులై 15 నుంచి IRCTC కొత్త వెబ్‌సైట్ అందుబాటులోకి తీసుకు వస్తోంది. టికెట్ బుకింగ్ సమయంలో వినియోగదారులు ఎదుర్కొంటున్న సాంకేతిక సమస్యలకు స్వస్తి పలుకుతూ, భారీ మార్పులతో సరికొత్త వెబ్‌సైట్‌ను రూపొందించారు. ప్రస్తుతం నిమిషానికి 32,000 టికెట్లు మాత్రమే బుక్ అవుతుండగా, ఇకపై నిమిషానికి 1.5 లక్షల టికెట్లను ప్రాసెస్ చేసేలా వ్యవస్థను రూపొందించారు. నిమిషానికి 4 లక్షల విచారణల నుంచి 40 లక్షల ఎంక్వైరీలను హ్యాండిల్ చేసే సామర్థ్యం ఉంటుంది. వెబ్‌సైట్ వేగంగా పనిచేస్తుంది.