పవన్ కోలుకోవాలని ప్రత్యేక పూజలు
NEWS Jul 14,2026 07:37 pm
పాల్వంచ: జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి భుజాలకు జరిగిన సర్జరీ నుంచి త్వరగా కోలుకోవాలని రెట్టింపు ఉత్సాహంతో ప్రజాక్షేత్రంలో వచ్చి సేవలు అందించాలని, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ శ్రీ అభయ ఆంజనేయ స్వామికి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జనసేన పార్టీ నాయకులు పాల్వంచ మండల అధ్యక్షుడు దేవా గౌడ్, టౌన్ ప్రెసిడెంట్ బ్రహ్మం మెగా ఫ్యాన్స్ అధ్యక్షులు ఖసిం సాయి, బాలాజీ తేజ పాల్గొన్నారు.