జర్నలిస్టులను అడ్డుకోవడం తగదు
NEWS Jul 14,2026 01:27 pm
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం బండగిరి నగరంలో విధి నిర్వహణకు వెళ్లిన జర్నలిస్టులను అటవీ శాఖ అధికారులు అడ్డుకోవడాన్ని పినపాక మండల రిపోర్టర్లు ఖండించారు. భయ్యారం క్రాస్‌రోడ్‌లో సమావేశమైన పాత్రికేయులు మాట్లాడుతూ, జర్నలిస్టులపై ఆంక్షలు విధించడం, కేసులు నమోదు చేస్తామని బెదిరించడం సరైన విధానం కాదన్నారు. మీడియా విధి నిర్వహణకు అధికారులు సహకరించాలని వారు డిమాండ్ చేశారు.