రాజకీయాల్లోకి ఎన్టీఆర్ వార్తలపై స్పష్టత
NEWS Jul 13,2026 02:42 pm
ఎన్టీఆర్ జులై 18న రాజకీయాల్లోకి రానున్నారంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై ఎన్టీఆర్ అభిమానుల సంఘం ఒక అధికారిక లేఖను విడుదల చేసింది. జులై 18న తాము నిర్వహించబోయే 'ఊరు-వాడ' కార్యక్రమానికి చాలా కాలం క్రితమే ప్రణాళికలు రూపొందించామని, దానికి తారక్ పొలిటికల్ ఎంట్రీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ఇది సామాజిక సేవా కార్యక్రమం మాత్రమేనని, రాజకీయాలతో ముడిపెట్టవద్దని, అసత్య ప్రచారాల చేయవద్దని కోరారు.