కోదండరాంకు TJF వినతి పత్రం
NEWS Jul 13,2026 08:06 am
తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు, సంక్షేమ కమి టీ కో-చైర్మన్, ఎమ్మెల్సీ ప్రొ. కోదండరాంకు తెలంగా ణ జర్నలిస్టుల ఫోరం (TJF) నాయకులు వినతి పత్రం అందజేశారు. TJF అధ్యక్షుడు పల్లె రవి కు మార్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఉద్యమకా రులు, జర్నలిస్టుల గుర్తింపు, సంక్షేమంపై సమగ్ర ప్రతిపాదనలు సమర్పించింది. TJF నాయకులు మేకల కృష్ణ, ఎక్కులూరి నాగార్జున్ రెడ్డి, నరసింహ స్వామి ముద్దం, పాలకూరి రాజు, ఓయూ శ్రీనివాస్, మహేంద్రచారి, పోగుల ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఉద్యమకారులు, జర్నలిస్టులకు ప్రభుత్వ పరంగా తగిన గుర్తింపు, సంక్షేమ పథకాలు కల్పించాలని టీజేఎఫ్ నాయకులు కోరారు.