శీతల పానీయం తాగిన వ్యాపారి అస్వస్థత
NEWS Jul 13,2026 02:16 pm
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం తొగూడెంలో శీతల పానీయం తాగిన అనంతరం ఓ చిరు వ్యాపారి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అస్వస్థతకు గల కారణాలపై విచారణ కొనసాగుతుండగా, వైద్యుల నివేదిక అనంతరం పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.