మెట్‌పల్లిలో మహిళ దారుణ హత్య
NEWS Jul 12,2026 06:45 pm
మెట్‌పల్లిలో మహిళ హత్య కలకలం రేపింది. శాంతినగర్ కాలనీలో నివాసం ఉంటున్న కర్రె సుజాత (34) మెడపై పదునైన ఆయుధంతో దాడి చేసి గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసి పరారయ్యారు. స్థానికులు ఘటనను గమనించి పోలీసులకు సమాచారం అందించగా, వారు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరిస్తూ దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు గల కారణాలు, నిందితుల వివరాలు ఇంకా తెలియరాలేదు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.