ప్రముఖ గాయని ఎస్.జానకి కన్నుమూత
NEWS Jul 11,2026 08:51 pm
ప్రముఖ గాయని ఎస్. జానకి (88) కన్నుమూశారు. గుండెపోటుతో మైసూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఎన్నో పాటలకు తన గాత్రంతో ప్రాణం పోసిన ఎస్ జానకి లేదని తెలిసి సినీలోకం దిగ్భ్రాంతి చెందింది. సినీ ప్రముఖులు ఆమె మరణంపట్ల సంతాపం తెలిపారు. 1938 ఏప్రిల్ 23న గుంటూరు జిల్లా పల్లపట్ల గ్రామంలో పుట్టిన జానకి.. చిన్నతనం నుంచే సంగీతంపై ఉన్న ఆసక్తితో గాయనిగా ఎదిగారు. 20కు పైగా భారతీయ, విదేశీ భాషల్లో పాటలు ఆలపించారు.