కేసీఆర్‌కు కాళేశ్వరం అప్పగించండి..
వారం రోజుల్లో నీళ్లు పారిస్తాం: కేటీఆర్
NEWS Jul 05,2026 08:33 pm
కేటీఆర్, సీఎం రేవంత్ రెడ్డికి కాళేశ్వరం ప్రాజెక్టుపై సవాల్ విసిరారు. కేసీఆర్‌కు వారం రోజుల పాటు కాళేశ్వరం బాధ్యతలు అప్పగిస్తే తెలంగాణ అంతటా నీళ్లు పారిస్తామన్నారు. కన్నెపల్లి వద్ద మోటార్లు ప్రారంభిస్తే వారం రోజుల్లో రిజర్వాయర్లు నింపవచ్చన్నారు. నీళ్లు ఇస్తే రైతులకు ఎరువులు, మద్దతు ధర, బోనస్, విద్యుత్ ఇవ్వాల్సి వస్తుందనే భయంతో ప్రభుత్వం ప్రాజెక్టును వినియోగించడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు ఉన్న నేపథ్యంలో సాగు, తాగునీటి అవసరాల కోసం కాళేశ్వరం నీటిని వినియోగించాలని డిమాండ్ చేశారు.