రూ.14.45 లక్షల విలువైన గంజాయి స్వాధీనం
NEWS Jul 05,2026 08:35 pm
భారీగా గంజాయి అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తిని పాల్వంచ పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. పాల్వంచలోని సంజయ్‌నగర్ వద్ద నిర్వహించిన వాహన తనిఖీల్లో ఒడిశా రాష్ట్రంలోని కలిమెల నుంచి మహబూబాబాద్‌కు ఆటోలో తరలిస్తున్న 28.9 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.14.45 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. నిందితుడు ఉప్పుగుండ్ల ప్రభాకర్ పాల్వంచ పట్టణంలోని ప్రియదర్శిని కాలనీకి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతని వద్ద నుంచి రూ.34 వేల నగదు, ఒక సెల్‌ఫోన్, ఆటోను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.