ఎంజేపీవీసీ నారాయణపేట జిల్లా అధ్యక్షుడిగా కొత్తపల్లి విజయ్‌కుమార్ ఎన్నిక
NEWS Jul 05,2026 08:34 pm
MJPVC నారాయణపేట జిల్లా అధ్యక్షుడిగా కొత్తపల్లి విజయ్‌కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు ముద్దు నవ్యశ్రీ ఆయనకు నియామక పత్రాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. సంఘాన్ని మరింత బలోపేతం చేసి సభ్యుల సంక్షేమానికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంజేపీవీసీ మక్తల్ అసెంబ్లీ అధ్యక్షుడు ఎస్. అశోక్, వ్యవస్థాపక అధ్యక్షుడు కే. అంజప్ప, మక్తల్ మండల అధ్యక్షుడు, మగనూర్ మండల ప్రతినిధి కే. ఆంజనేయులు, కృష్ణ మండల అధ్యక్షుడు గణేష్, ముడుమాల్ ఓబులేశ్ తదితరులు పాల్గొన్నారు.