సీఎంకి మాంగ్ సమాజ్ పాలాభిషేకం
NEWS Jul 04,2026 09:00 am
HYD: మాంగ్ కులానికి కుల ధృవీకరణ పత్రాలు జారీ చేసే అధికారాన్ని ఆర్డీవో నుంచి తహశీల్దార్‌కు బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడాన్ని మాంగ్ సమాజ్ సంఘం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కు పాలాభి షేకం నిర్వహించారు. కుల ధృవీకరణ పత్రాల జారీ సులభతరం కావడంతో తమకు ప్రభుత్వ సేవలు అందుతాయని అధ్యక్షుడు గాయక్వాడ్ తులసీ దాస్ మాంగ్, ప్రధాన కార్యదర్శి కాంబ్లే శంకర్ మాంగ్ అన్నారు. మాంగ్ నాయకులు, సభ్యులు పాల్గొని సంబరాలు నిర్వహించారు.