ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశానికి ఎమ్మెల్యే
NEWS Jul 04,2026 03:33 pm
రాయికల్: కైరీగూడెం గ్రామంలో నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పాల్గొన్నారు. లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపి చీరలను కానుకగా అందజేశారు. కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ కాటిపెళ్లి గంగారెడ్డి, సర్పంచ్ కుర్ర మల్లవ్వ, ఉప సర్పంచ్ నరేష్, మాజీ ఎంపీపీ సంధ్యారాణి సురేందర్ నాయక్, ప్యాక్స్ చైర్మన్ ఏనుగు మల్లారెడ్డి, కోల శ్రీనివాస్, సర్పంచులు, మండల, గ్రామ నాయకులు పాల్గొన్నారు.