హైదరాబాద్‌లో ₹20.59 కోట్ల గోల్డ్ మోసం
NEWS Jun 23,2026 10:38 am
హైదరాబాద్‌లో భారీ జ్యువెల్లరీ మోసం. కేవీ జ్యువెల్లర్స్, నితిన్ జ్యువెల్లర్స్ నిర్వాహకుడు నితిన్ గులాబానీ ప్రముఖ కార్పొరేట్ జ్యువెల్లరీ సంస్థలతో తనకు వ్యాపార సంబంధాలు ఉన్నాయని నమ్మించి పలువురు వ్యాపారుల నుంచి 13.6 కిలోల బంగారు ఆభరణాలు తీసుకున్నాడు. వాటి విలువ సుమారు రూ.20.59 కోట్లు. మొదట్లో విశ్వాసం పొందిన అతడు, తాజాగా బంగారంతో పరారయ్యాడు. సీసీఎస్ పోలీసులు నితిన్‌తో పాటు మరో ఐదుగురిపై మోసం, నమ్మక ద్రోహం కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.