ప్రతిభ గల విద్యార్థులకు మెడల్స్ ప్రదానం
NEWS Jun 23,2026 10:33 am
బుచ్చయ్యపేట: వడ్డాది గ్రామంలోని నేషనల్ ట్రినిటీ స్కూల్‌లో 2025-26 విద్యా సంవత్సరంలో ఉత్తీర్ణులైన విద్యార్థులను ఘనంగా సత్కరించారు. స్కూల్ కరస్పాండెంట్ వి. రామరాజు, ప్రిన్సిపల్ వి. రాజరాజేశ్వరి విద్యార్థులకు జ్ఞాపికలు, మెడల్స్ అందజేసి అభినందించారు. విద్యలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ వారికి శుభాకాంక్షలు తెలిపారు. తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు.